- corona cases : రాష్ట్రంలో కొత్తగా 1,535 కరోనా కేసులు.. 16 మంది మృతి
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,088 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,535 కరోనా కేసులు, 16 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా నుంచి 2,075 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,210 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- NARA LOKESH: 'సీఎం ధనదాహానికి యువకులు బలవుతున్నారు'
రాష్ట్రంలో ఎక్సైజ్ పోలీసుల వేధింపులు ఎక్కువవుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చేనేత వర్గానికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఇందుకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Pawan kalyan: విజయవాడకు చేరుకున్న పవన్ కల్యాణ్
జనసేనాని పవన్ కల్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రాష్ట్రానికి వచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Heart Attack: విధి నిర్వహణలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్.. గుండెపోటుతో మృతి
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట సబ్‌జైలులో హెడ్‌కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణలో ఉండగానే సత్యనారాయణమూర్తి అనే హెడ్‌కానిస్టేబుల్ గుండెపోటుకు గురయ్యారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ముఖ్యమంత్రికి కొత్త సమస్య- ఆ విషయంలో తికమక
కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మైకి అధికారిక నివాసం విషయంలో సమస్య ఎదురైంది. 'కావేరీ' అధికారిక భవనంలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఉంటుండగా.. 'అనుగ్రహ' భవనంలో లోకాయుక్త జస్టిస్ విశ్వనాథ శెట్టి ఉంటున్నారు. దాంతో బొమ్మై.. తాను ఎక్కడ ఉండాలో తేల్చుకోలేకపోతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అనాథ బాలికపై అత్యాచారం- ఫోన్లో చిత్రీకరించి..
అనాథ బాలికపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక ఆ దృశ్యాలను తమ ఫోన్లో చిత్రీకరించి బెదిరించిన దిగ్భ్రాంతికర ఘటన మహారాష్ట్రలో జరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- భారీ భూకంపం- రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత
అమెరికాలోని అలాస్కాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఓలా ఈ-స్కూటర్.. ఆగస్టు 15న మీ ముందుకు
ఎలక్ట్రిక్ వాహన విపణిలోకి ప్రవేశించిన ఓలా సంస్థ.. తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను(ఈ- స్కూటర్) స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని విడుదల చేయనుంది. పది రంగుల్లో ఈ స్కూటర్లను అందుబాటులో ఉంచింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని విశేషాలు.. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రాహుల్‌పై బీరు కార్క్స్.. ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం
లార్డ్స్ టెస్టు మూడో రోజు ఇంగ్లాండ్ అభిమానులు అనుచితంగా ప్రవర్తించారు. టీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై బీర్ కార్క్స్ విసిరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Netrikann Movie Review: నయనతార 'నెట్రికన్' ఎలా ఉందంటే..?
నయనతార నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'నెట్రికన్'. డిస్నీఫ్లస్ హాట్‌స్టార్‌లో శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది ఈ రివ్యూ చూసి తెలుసుకుందాం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.