- BHOGI CELEBRATIONS: ఘనంగా భోగి సంబరాలు.. కళకళలాడుతున్న తెలుగు లోగిళ్లు
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ వెల్లువెత్తుతోంది. అంగరంగ వైభవంగా జరుపుకునే మూడు రోజుల పండగలో మొదటి రోజు భోగి మంటలతో పండుగకు స్వాగతం పలికారు. రంగవల్లులు, హరిదాసు కీర్తనలతో తెలుగు ముంగిళ్లు కళకళలాడుతున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Online Betting: ఆన్‌లైన్‌లోకి కోళ్లు, పందేలు.. లైవ్‌లో చూస్తూ బెట్టింగులు
online cockfight bettings: సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది కోడిపందేలు. తెలుగు సంప్రదాయం, పౌరుషానికి ప్రతీకగా నిలిచే కోడిపందేలను పశ్చిమ గోదావరికి చెందిన కొందరు ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. వాట్సప్ గ్రూపులను ఏర్పాటుచేసి పందెం కోళ్లను అమ్మటం, పందేలనూ లైవ్‌లో ప్రదర్శిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ACCIDENT : తాడేపల్లిగూడెంలో లారీ బోల్తా...నలుగురు మృతి
పండుగ పూట పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెంలో చేపల లోడుతో వస్తున్న లారీ.. అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి.. మరో 2.64 లక్షల మందికి వైరస్
Covid cases in India: భారత్‌లో కొత్త కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. మరో 2,64,202 మందికి వైరస్ సోకింది. మరో 315 మంది వైరస్‌కు బలయ్యారు. 1,09,345 మంది కొవిడ్‌ను జయించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- తమిళనాట జల్లికట్టు సంబరం- యువత ఉత్సాహం
తమిళనాడులో పొంగల్ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు సంబరాలు ప్రారంభమయ్యాయి. బసవన్నలను అదుపు చేసేందుకు క్రీడాకారులు ఉత్సాహం చూపిస్తున్నారు. శుక్రవారం మదురై జిల్లాలోని అవనియపురంలో జరిగిన జల్లికట్టు పోటీలు ఆకట్టుకున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పట్టాలు తప్పిన రైలు.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య
Train Accident: బంగాల్లో బికనేర్- గువాహటి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. మరో 45 మంది గాయపడ్డారు. రైలు ప్రమాదంలో మృతులకు సంతాపం ప్రకటించారు ప్రధాని మోదీ. మరోవైపు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు రైల్వే మంత్రి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 400 మైనస్
స్టాక్ మార్కెట్లు వారంతపు సెషన్‌ను నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 407 పాయింట్లు కోల్పోయి 60,827కి చేరింది. నిఫ్టీ 114 పాయింట్లు క్షీణించి 18143 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు, కరోనా కేసుల పెరుగుదల మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Financial Planning Health: ఆరోగ్యానికి ఆర్థిక ప్రణాళిక వేసుకోండిలా!
Financial Planning: గత రెండేళ్లలో కరోనా కారణంగా మనం ఊహించని సంఘటనలు ఎన్నో చూశాం. దేశ వ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు ఆరోగ్య అత్యవసరాలు, ఆర్థిక భారాన్ని ఎదుర్కొన్నాయి. ప్రజల జీవితాల్ని తలకిందులు చేసిన మహమ్మారి మరోసారి తన రూపం మార్చుకొని, సవాలు విసురుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ముందు వాటిపై దృష్టిపెట్టు'.. కోహ్లీకి నెటిజన్ల చురకలు
IND vs SA: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపతున్నారు. కోహ్లీ.. జట్టు కూర్పు, ఆటగాళ్ల బ్యాటింగ్ మీద దృష్టిసారించాలని, అనవసర విషయాల మీద కాదని చురకలు అంటిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Darshakaratna Film: జాతీయ స్థాయి నటుడితో 'దర్శకరత్న'
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం 'దర్శకరత్న'. ధవళ సత్యం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి తాడివాక రమేష్‌నాయుడు నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.