శ్రీకాకుళంలో...
శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్టీసీ డిపో ముందు దీక్షా శిబిరాన్ని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ప్రారంభించారు. పని భారం తగ్గించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సౌకర్యాలు కోత విధించే నిర్ణయాలు మానుకోవాలన్నారు. బకాయి లు తక్షణమే చెల్లించాలని కోరారు.
కర్నూలు జిల్లాలో...
ఆర్టీసీ యాజమాన్యం విధానాలను వ్యతిరేకిస్తూ బనగానపల్లి ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన దీక్ష చేశారు. 2011 ప్రకారం పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కార్మికులు సామూహిక నిరహర దీక్షలు చేపట్టారు. సంస్థను ప్రభుత్వంలో వీలీనం చేయడంపై సంతోషపడాలో భాద పడాలో అర్థం కావడం లేదని వాపోయారు.
విశాఖలో...
విశాఖ జిల్లా నర్సీపట్నం లో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర యూనియన్ పిలుపుమేరకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులు రిలే నిరాహార దీక్షలకు దిగారు.
విజయవాడలో ...
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, కార్మికులకు గతంలో ఉన్న సౌకర్యాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఆందోళన చేపట్టారు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు.
కడప జిల్లాలో...
కడప డిపో అధికారుల వైఖరిని నిరసిస్తూ కడప బస్ స్టేషన్ ఎదుట నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ జమ్మలమడుగు ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఆందోళన చేపట్టారు. బద్వేలులో ఆర్టీసీ యాజమాన్యం విధానాలను వ్యతిరేకిస్తూ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్షను చేపట్టారు.
ఇదీ చూడండి: