'ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు' - టీజీ వెంకటేష్ మ్యారేజ్ డే న్యూస్
రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా ప్రజలు భయందోళనకు గురౌతున్నారని రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్ అన్నారు. వివాహ దినోత్సవం సందర్భంగా కర్నూలులో ఆర్యవైశ్యలు టీజీ.వెంకటేష్ దంపతులను సన్మానించారు. అనంతరం టీజీ.వెంకటేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంచి పనులు చేస్తున్నా... కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అభద్రత భావంతో ఉన్నారని ఆయన చెప్పారు. ఏప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు పెడుతున్నారనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరించాలన్నారు.
టీజీ.వెంకటేష్ దంపతులను సన్మానిస్తున్న ఆర్యవైశ్యలు