ETV Bharat / city

కర్నూలు ఉల్లి రైతు కంట కన్నీరు

ధరలు పెరుగుతున్నాయని ఆశపడిన కర్నూలు జిల్లా ఉల్లి రైతులకు.. వర్షం తీవ్ర నిరాశ మిగిల్చింది. వర్షాలకు తడిసి పొలాల్లోనే ఉల్లి పంట కుళ్లిపోతుంది. రేట్లు ఆశాజనకంగా ఉన్నా.. దిగుబడులు రాక పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడులు తగ్గితే ఉల్లి ధరలు ఆకాశనంటే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

author img

By

Published : Oct 15, 2020, 10:20 PM IST

ఉల్లి రైతు కంట కన్నీరు
ఉల్లి రైతు కంట కన్నీరు

కరోనా కారణంతో గ్రామాల నుంచి వలసలు ఆగిపోయాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు పల్లెలకు చేరుకున్నారు. గ్రామాలకు తిరిగి వచ్చిన వారంతా వ్యవసాయంపై దృష్టిసారించారు. దీంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో 45 వేల ఎకరాల్లో ఉల్లి పంట వేశారు. దిగుబడులు ఎక్కువ వస్తాయని రైతులు ఆశించిన తరుణంలో భారీ వర్షాలు, వరదలు పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. చేతికొచ్చిన పంటను నీట ముంచాయి. దిగుబడులు సగానికి పైగా తగ్గిపోయాయి.

ఉల్లిపంట సాగుకు ఎకరానికి సుమారు రూ.50 వేల నుంచి రూ.70 వేలు పెట్టుబడి అవుతుందని రైతులు చెప్పారు. మంచి దిగుబడులు వస్తే... ఎకరానికి సుమారు వంద క్వింటాళ్ల పంట వస్తుందన్నారు. వర్షాల కారణంగా ఎకరానికి 50 క్వింటాళ్లు కూడా రావటంలేదని రైతులు తెలిపారు. దీనికి తోడు కూలీల కొరత ఎక్కువగా ఉందని అంటున్నారు. రవాణా ఖర్చులు రెట్టింపయ్యాయన్నారు. ఈ పరిస్థితుల్లో ధరలు ఆశాజనంగా ఉన్నా... తగ్గిన దిగుబడులు, పెరిగిన ఖర్చులతో రైతన్నలు కుదేలవుతున్నారు. వానల వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతన్నలు వాపోతున్నారు.

అక్టోబర్ నెలలో కర్నూలు ఉల్లి మార్కెట్​కు 3 వేల క్వింటాళ్ల ఉల్లి వచ్చేది. వరదల ప్రభావంతో ప్రస్తుతం 6 వందల నుంచి 8 వందల క్వింటాళ్ల ఉల్లి మాత్రమే వచ్చిందని అధికారులు తెలిపారు. ఉల్లి ధరలు క్వింటాకు కనిష్ఠంగా రూ.600, గరిష్ఠంగా రూ.4,100 సరాసరిన రూ.2,950 వరకు ఉన్నాయన్నారు. వర్షాల వల్ల ఉల్లి తడిసిపోయి నాణ్యత లోపిస్తోందని, నీరుచేరి కుళ్లిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు.

వర్షాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఉల్లి పంటకు పూర్తిగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు. ఈ ప్రభావం ఉల్లి ధరలపై పడే అవకాశం ఉందన్నారు.

ఇదీ చదవండి : ఫేస్​బుక్ ఫ్రెండ్..నగలతో ఉడాయించాడు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.