ETV Bharat / city

రాజవర్ధన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది: లోకేశ్​

తెలుగుదేశం నేత రాజవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని నారా లోకేశ్​ పరామర్శించారు. పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

Nara Lokesh
రాజవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేశ్
author img

By

Published : May 2, 2022, 2:09 PM IST

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కర్నూలు మాజీ ఎంపీపీ, తెలుగుదేశం నేత రాజవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. రాజవర్ధన్ రెడ్డి తండ్రి విష్ణువర్ధన్ రెడ్డిని ఓదార్చిన లోకేశ్​.. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అంతకుముందు.. చిత్రపటానికి లోకేశ్ నివాళులు అర్పించారు. గతనెల 20న రాజవర్ధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.

రాజవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేశ్

"రాజ్​ వర్ధన్​రెడ్డి ముందు నా స్నేహితుడు...ఆ తర్వాతనే రాజకీయాలు. రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగినా.. ఒక ఐటీ ప్రొఫెషనల్​గా ఉన్నత స్థాయికి ఎదిగి పదేళ్లు బాగా కష్టపడి.. తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కర్నూలు రూరల్​ ఎంపీపీగా పోటీ చేసి గెలుపొందారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు రాజ్​వర్ధన్​రెడ్డి నన్ను కలిసినా.. ఏనాడు వ్యక్తిగత పనులు, కాంట్రాక్టుల గురించి మాట్లాడలేదు. చాలా చిన్న వయసులోనే కన్నుమూశారు. రాజవర్ధన్​ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను." - నారా లోకేశ్​

ఇదీ చదవండి: కార్మికులను గౌరవించే సంస్కారం సీఎం జగన్‌కు లేదు: అచ్చెన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.