Nandyal: జిల్లాల విభజనలో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాలను నూతన జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం తాత్కాలిక పరిపాలన భవనాల ఎంపికపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మూడేళ్ల క్రితం నిర్మించిన భవనాన్ని... రెవెన్యూ అధికారులు నంద్యాల జిల్లా కలెక్టరు కార్యాలయంగా మార్చారు. దీనితో పాటు కొత్త జిల్లాకు అవసరమైన మిగతా కార్యాలయాల భవనాలను గుర్తించడంపై ప్రభుత్వ అధికారులు దృష్టి సారించారు.
cm jagan review on new districts : కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ప్రణాళికావిభాగం కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తదితర అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలు, మంత్రులు నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు. ఇప్పటి వరకూ 9 వేలకు పైగా ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్లో ఇప్పటికే కొన్ని పరిష్కరించామని అధికారులు.. సీఎంకు వివరించినట్టు తెలుస్తోంది.
పేర్లు మార్చాలని, రెవెన్యూ డివిజన్లను మార్చాలని కోరుతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలపై సీఎం చర్చించినట్టు సమాచారం. మరోవైపు జిల్లాల విభజనకు సంబంధించి క్షేత్రస్థాయిలో చేసిన మార్పులపైనా సీఎస్.. ముఖ్యమంత్రికి వివరించినట్టు తెలుస్తోంది. దాదాపు గంటన్నరపాటు ముఖ్యమంత్రి దీనిపై సమీక్షించారు. మార్చి 31 తేదీన కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ను జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: మరో ప్రాణాన్ని తీసిన 'నాటు సారా'.. శోకసంద్రంలో బాధిత కుటుంబం