కరోనా వ్యాప్తిస్తున్నందున పట్టణాల్లోని రోజుకూలీల పరిస్థితి దయనీయంగా మారింది. పనులు లేకపోవడంతో ఇల్లు గడవటం భారమైంది. కర్నూలు నగరంలోని 5 రోడ్ల కూడలిలో నిత్యం వందల మంది కూలీలు అడ్డాపైకి వస్తుంటారు. ఎవరైనా పని కల్పించేవారు వస్తే వారి వాహనాన్ని చుట్టుముట్టి బతిమాలుకుంటున్నారు. పని కోసం పిలిచేందుకు వచ్చిన ఓ వ్యక్తి వాహనంపై మహిళా కూలీ వెంటనే కూర్చొని నాకే పని ఇప్పించండి సారూ అని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి. అసలే మధుమేహం, ఆపై కరోనా... స్టిరాయిడ్స్ వాడకంతో పెరుగుతున్న చక్కెర స్థాయిలు