కర్నూలు జిల్లాలో కరోనా కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. రోజురోజుకూ జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో... నిబంధనలు ఉల్లంఘించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. రెడ్‌జోన్, హైరిస్క్ అలర్ట్ ప్రాంతాల ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఈనెల 20 నుంచి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని సడలింపులు ఉంటాయని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జిల్లాలో పరిస్థితిని సమీక్షిస్తున్నామంటున్నారు.
ఇదీ చదవండి : 'ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా కరోనా పరీక్షల వేగం పెంచండి'