ETV Bharat / city

కార్తిక పౌర్ణమి..పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మికశోభ - కార్తిక సోమవారం వార్తలు

పరమపావనమైన కార్తికమాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా సోమవారం శివాలయాలు, పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మికశోభ సంతరించుకుంది. హరిహరులకు ఎంతో ప్రీతికరమైన రోజున దీపోత్సవాన్ని మహిళలు వైభవంగా జరిపారు. శివలింగం ఆకారాల్లో దీపాలు వెలిగించి హారతులు నిర్వహించారు.

కార్తిక పౌర్ణమి
కార్తిక పౌర్ణమి
author img

By

Published : Dec 1, 2020, 6:01 AM IST

కార్తిక పౌర్ణమి..పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మికశోభ

సోమవారం కార్తికపౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో దీపారాధన చేశారు. కర్నూలు కేసీ కాలువలో కార్తిక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో దీపాలు వెలిగించారు. సంప్రదాయ నృత్యాలు చేశారు. మంత్రాలయంలో పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన కార్తిక మహాదీపోత్సవంలో కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు. దీప పూజ, దీపదానం, మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవని స్వామీజి తెలిపారు. దీపోత్సవంలో 500 మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లావ్యాప్తంగానూ దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాల శివాలయంలో దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఓం, శివలింగం ఆకారాల్లో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ సింహాచలం ఆలయంలో పుణ్యనదీ హారతి నిర్వహించారు. కోనేరులో దీపాలను వదిలారు. వెంకోజీపాలెంలోని గౌరీజ్ఞాన లింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన జ్వాలాతోరణం విశేషంగా ఆకట్టుకుంది. నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

కార్తిక పౌర్ణమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో పంపా హారతులు ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొండ దిగువున పంపా సరోవరం చెంతకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంపా సరోవరానికి పంచ హారతులు ఇచ్చారు.

ఇదీ చదవండి : తిరుమలలో వైభవంగా గరుడ సేవ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.