కర్నూలు నగరంలోని పలు హోటళ్లలో.. ఆహార తనిఖీ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నాలుగు బృందాలుగా ఏర్పడి చెరొక హోటల్లో సోదాలు చేశారు. రాజ్ విహార్ హోటల్లో నిబంధనలకు విరుద్ధంగా ఆహారం నిల్వచేసినట్లు అధికారులు గుర్తించారు. కలుషిత ఆహారాన్ని ప్రయోగశాలకు పంపుతున్నట్లు విజిలెన్స్ సీఐ మహేశ్వర్రెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి: పుష్కర ఘాట్ల పనులపై కలెక్టర్ అసంతృప్తి