ETV Bharat / city

Fake WhatsApp: "ఆ వాట్సాప్‌ గ్రూప్‌నకు... మఠానికి సంబంధం లేదు"

author img

By

Published : Apr 8, 2022, 9:59 AM IST

Fake WhatsApp group: 'మాతృభూమి హిందూ స్పందనె’ పేరుతో ఓ వాట్సాప్‌ గ్రూప్‌ను సృష్టించి కొందరు విరాళాలు వసూలు చేస్తున్నారని మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం అధికారులు అన్నారు. అయితే దానికీ మఠానికీ ఎలాంటి సంబంధమూ లేదని అధికారులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Fake WhatsApp group
నకిలీ వాట్సప్​ గ్రూపు పేరుతో విరాళాలు

Fake WhatsApp group: రాఘవేంద్రస్వామి భక్తుల సౌకర్యార్థం అంటూ 'మాతృభూమి హిందూ స్పందనె' పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని రాఘవేంద్రస్వామి మఠం అధికారులు తెలిపారు. 94833 96896 చరవాణి సంఖ్యతో గ్రూప్‌ ప్రారంభించి విరాళాలు అడుగుతున్నారన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమైనదని.. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. భక్తులెవరూ ఎలాంటి విరాళాలు ఇవ్వకూడదని, జాగ్రత్తగా ఉండాలని కోరారు. మఠం విరాళాలను కేవలం బ్యాంకు ఖాతాలు, అధికారిక రసీదులు ద్వారానే స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: Attack on Hospital: 'నేను తలచుకుంటే ఆస్పత్రే ఉండదు'.. వైకాపా నేత అనుచరుడి బెదిరింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.