Srisailam Trust Board: శ్రీశైలం దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి కొలువుదీరింది. ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా రెడ్డివారి చక్రపాణిరెడ్డితోపాటు మరో 14 మంది సభ్యులు దేవస్థాన పరిపాలనా భవనంలో ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో ఆలయ ఈవో లవన్న ప్రమాణం చేయించారు. అలాగే ఆలయ ప్రధానార్చకులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణం చేశారు. పదవులు ఇచ్చినందుకు పాలకమండలి ఛైర్మన్, సభ్యులు.. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన.. "పదో తరగతి" బాలిక!