పంచాయతీలో నిధులను తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం వల్ల పంచాయతీలో తాత్కాలికంగా పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు చెల్లించలేని స్థితిలో ఉన్నామని ఆలూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అరుణాదేవి అన్నారు. ఈ విషయంపై ఆలూరు పట్టణంలో రోడ్లపై చెత్తను ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం పంచాయతీ కార్మికులతో కలిసి పట్టణంలో చెత్త రిక్షాను తోసుకుంటూ నిరసన తెలిపారు. పంచాయతీ నిధులను తీసుకుని తిరిగి చెల్లించకుంటే తాము పంచాయతీలో అభివృద్ధి పనులు ఎలా చేసేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. పంచాయతీ కనీసం రూ.6 వేలు వేతనం చెల్లించలేని దౌర్భాగ్యం నెలకొందని అన్నారు.
ఇవీ చదవండి: