- CM Jagan : ఉద్యోగుల ఉచిత గృహ వసతి సౌకర్యం... పొడిగింపునకు సీఎం అంగీకారం
సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహవసతి సౌకర్యాన్ని పొడిగించేందుకు ముఖ్యమంత్రి జగన్(cm jagan) అంగీకరించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం(cm office) సమాచారం పంపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏపీ, ఒడిశా వైపుగా అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ వర్షాలు..!
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. శుక్రవారానికి పశ్చిమ వాయవ్యంగా కదులుతూ.. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరం వైపు పయనిస్తుందని అంచనా వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- IIT MAINS RANK: ఐఐటీ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో గుంటూరు విద్యార్థికి 10వ ర్యాంకు
ఐఐటీ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించాడు. నిరంతర శ్రమతోనే ఇది సాధ్యమైందని విద్యార్థి హృషికేష్ అంటున్నాడు. పండుగ రోజు ఫలితాలు రావడంపై వారి కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- corona cases : రాష్ట్రంలో కొత్తగా 586 కరోనా కేసులు నమోదు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 44,946 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు(corona tests) నిర్వహించగా... కొత్తగా 586 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 9 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- '2024 ఎన్నికలకు ముందే అయోధ్య రాముని దర్శనం'
అయోధ్యలో రామ మందిర (Ayodhya Ram Mandir) నిర్మాణం సాధారణ ఎన్నికల (Lok Sabh Election 2024 ) కంటే ముందే పూర్తి కానుందని ఆలయ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 2023 నాటికి భక్తుల కోసం ఆలయ తలుపులు తెరుచుకుంటాయని ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రక్షణ రంగంలో మునుపెన్నడూ లేనంత పారదర్శకత'
మునుపెన్నుడూ లేనంతగా రక్షణ రంగంలో పారదర్శకత, విశ్వాసం పెంపొందాయని (defence sector reforms) ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ స్థానంలో ఏర్పాటు చేసిన 7 ఆయుధ కర్మాగారాలను జాతికి అంకితం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కత్తిదాడిలో ఎంపీ మృతి- అందరూ చూస్తుండగానే..
బ్రిటన్‌లో ఓ ఎంపీపై జరిగిన కత్తి దాడి తీవ్ర కలకలం సృష్టించింది. తూర్పు ఇంగ్లాండ్ ఎసెక్స్‌లోని సొంత నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ డేవిడ్ అమెస్ పాల్గొనగా ఆయనపై దుండగుడు దాడి చేశాడు. డేవిడ్ శరీరంపై అనేకమార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అమెస్ మృతిచెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Crude Oil Price: మూడేళ్ల గరిష్ఠానికి క్రూడాయిల్ ధరలు- మరి భారత్‌లో?
అంతర్జాతీయంగా క్రూాడాయిల్ ధరలు (Crude Oil Price) భారీగా పెరిగాయి. లండన్‌లో ఓ బ్యారెల్ ధర మూడేళ్ల గరిష్ఠానికి చేరింది. కరోనా ఆంక్షలు తొలగిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవడంతో చమురుకు డిమాండ్ ఎక్కువైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- థియేటర్లలో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రత్యక్షప్రసారం
టీ20 ప్రపంచకప్‌లో(ICC T20 World Cup 2021) భారత్ ఆడనున్న మ్యాచ్‌లను తమ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పీవీఆర్(PVR Cinemas News) ప్రకటించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలితో తాము ఒప్పందం కుదుర్చుకున్నట్లు పీవీఆర్ సినిమాస్ సీఈఓ గౌతమ్ దత్తా తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చిరు-చరణ్‌తో 'కేజీఎఫ్' డైరెక్టర్.. సినిమా గురించేనా?
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi family) ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీకి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ వచ్చారు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేశారు. ఇందులో చరణ్‌తో కలిసి ఆయన ఉండటం వల్ల అభిమానులు అప్పుడే సినిమా చేస్తారంటూ గుసగుసలాడేసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - ap top ten news
..
ప్రధాన వార్తలు @9PM

Last Updated : Oct 15, 2021, 9:14 PM IST