ETV Bharat / city

త్వరలో భారీ కార్యక్రమాలకు శ్రీకారం: సోము వీర్రాజు

author img

By

Published : Sep 2, 2020, 4:37 PM IST

Updated : Sep 2, 2020, 4:43 PM IST

త్వరలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసి పదాధికారుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని, దీన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభిస్తారని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లా వచ్చిన ఆయన.. కార్యకర్తలతో సమావేశమయ్యారు.

Somu Veerraju press meet in Kakinada Over BJP Programs in ap
సోము వీర్రాజు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించానని... జాతీయ నాయకత్వం సూచనల మేరకు త్వరలో భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. సెప్టెంబరు 17న భారత ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం ఉందని... 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర పార్టీ పది కార్యక్రమాలు నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు.

ప్రతీ మండలంలో మొక్కలు నాటడం, దివ్యాంగులకు పరికరాల పంపిణీ, కళ్లజోళ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు, కొవిడ్‌ పీడితులకు ప్లాస్మా దానం, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబరు 5న దీన్‌దయాళ్​‌ ఉపాధ్యాయ, అక్టోబరు 2న గాంధీ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సోము వీర్రాజు చెప్పారు.

ఇదీ చదవండీ... ఏపీలో 54.96 శాతం పెరిగిన రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు

Last Updated : Sep 2, 2020, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.