ETV Bharat / city

రాఖీ కట్టలేకపోతున్నందుకు బాధలేదు.. ఎందుకంటే!?

రాఖీ పూర్ణిమ వేళ తమ సోదరులకు రాఖీ కట్టలేకపోయామనే బాధకంటే.. దేశ సరిహద్దు విధుల్లో ఉన్నారనే ఆనందమే అధికమని నిజామాబాద్​ జిల్లా ఆడపడచులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

solders-raksha-bhandan-in-nizamabad
author img

By

Published : Aug 15, 2019, 1:06 PM IST

రాఖీ కట్టలేకపోతున్నందుకు బాధలేదు.. ఎందుకంటే

అన్నదమ్ములకు రాఖీ కట్టడం అక్కా చెల్లెళ్లకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలాకాసే సైనికులకు వారి అక్కాచెల్లెళ్ల చేత రాఖీ కట్టించుకునే భాగ్యం ఎప్పుడోగాని రాదు. పోస్టుల ద్వారా రాఖీ పంపించినా... నేరుగా రాఖీ కట్టలేకపోయామనే బాధ సోదరీమణుల్లో ఉంటుంది. అదే క్షణం ఎందరో అక్కాచెల్లెళ్లకు రక్షణగా నిలుస్తున్నారన్న సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, రాఖీ ఒకే రోజు రావడం ఆనందంగా ఉందంటున్నారు సైనికుల సోదరీమణులు.

తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 2,100 మంది సైనికులు త్రివిధ దళాల్లో పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికంగా దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దేశరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయక సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు. రాఖీ పండుగ నాడు సోదరులు పక్కన లేరని బాధపడుతున్నా.. అదే క్షణంలో దేశ రక్షణలో పాలుపంచుకుంటున్నాడనే సంతృప్తి ఉందన్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.