ETV Bharat / city

అదనపు సామర్ధ్యాలతో బియ్యం ఎగుమతి చేసేందుకు అనుమతి

author img

By

Published : Feb 3, 2021, 5:40 PM IST

కాకినాడ డీప్ వాటర్ పోర్టు నుంచి అదనపు సామర్ధ్యాలతో బియ్యం ఎగుమతి చేసేందుకు అనుమతి మంజూరు చేస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాంకరేజీ పోర్టు నుంచి పరిమితికి మించి బియ్యం అదనపు ఎగుమతుల కోసం అనుమతులు జారీ చేసేందుకు అవకాశం కల్పిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Permission to export rice with additional capacities

కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి కనీసంగా 10 నౌకల బియ్యాన్ని ఎగుమతి చేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అవుటర్ హార్బర్​లో నౌకల నిరీక్షణ సమయాన్ని తగ్గించటంతో పాటు హ్యాండ్లింగ్ సామర్ధ్యాన్ని మరింతగా పెంచే అంశంపై దృష్టి పెట్టాలని సంబంధింత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి అదనపు ఎగుమతి సామర్ధ్యాన్ని పెంచేందుకుగానూ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మారిటైమ్ బోర్డు సీఈఓ నేతృత్వంలో 9 మంది అధికారులతో కమిటీని నియమిస్తూ... పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. పోర్టులో కార్గో హ్యాండ్లింగ్ సామర్ధ్యాలను మరింతగా పెంచేందుకు సాగర్ మాల ప్రాజెక్టులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం వంద కోట్లను కేటాయించనుంది.

ఇదీ చదవండీ... 'ఎన్నికలు ప్రశాంతంగా జరగడం ముఖ్యమంత్రికి ఇష్టం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.