కరోనా రోగులకు ఆర్ఎంపీ డాక్టర్లు ఇష్టానుసారంగా వైద్యం చేయడం వల్ల చాలా మంది చనిపోతున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు కూడా మానవత్వంతో ఆలోచించాలని.. సంపాదన కోసం కాకుండా ప్రజలకు సహాయం చేసేలా చూడాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కొవిడ్ కంట్రోల్ రూంను పరిశీలించిన ఆయన.. అధికారుల నుంచి వివరాలు సేకరించారు. కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలిపారు.
ఇదీ చదవండి