ETV Bharat / city

MURDER AT KAKINADA: వ్యక్తి దారుణ హత్య.. ఆ లావాదేవీలే కారణమా! - కాకినాడలో హత్య

MURDER AT KAKINADA: కాకినాడ నగరంలో దారుణ హత్య చోటుచేసుకుంది. సత్తిబాబు అనే వ్యక్తిని కిరాతకంగా నిందితులు కత్తితో పొడిచి చంపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

MURDER AT KAKINADA
MURDER AT KAKINADA
author img

By

Published : Dec 6, 2021, 12:19 AM IST

MURDER AT KAKINADA: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణ హత్య చోటుచేసుకుంది. దుమ్ములపేట శ్రీరాం కాలనీలో చింతల సత్తిబాబు అనే వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచి దారుణంగా చంపేశారు. నగదు లావాదేవీల్లో తలెత్తిన వివాదమే హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది.

మృతుడు సత్తిబాబుపై పలు కేసులు ఉన్నాయి. ఘటనా స్థలిని ఏఎస్పీ కరణం కుమార్, డీఎస్పీలు భీమారావు, రమేశ్​లు పరిశీలించారు. నలుగురు వ్యక్తులు దాడిచేసి సత్తిబాబును హతమార్చారని.. నిందితుల్లో ఒకరిని పట్టుకున్నట్టు ఏఎస్పీ వెల్లడించారు. నిందితుల కోసం రెండు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు తెలిపారు. ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఇదీ చదవండి:

Head Constable Suspicious Death: అనుమానాస్పదస్థితిలో హెడ్ కానిస్టేబుల్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.