తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తపేట మండలం వానపల్లిలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి మహమ్మారి సోకింది. వారిలో తల్లిదండ్రులతోపాటు ఏడేళ్ల బాలుడి ఉన్నాడు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ బాదితులకు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌గా ఉన్న 50 మందిని గుర్తించి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వానపల్లి పీహెచ్సీ వైద్యాధికారి శర్మ అన్నారు. రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు.
అనపర్తిలో కొత్తగా 4 కేసులు నమోదయ్యాయి.. స్థానిక ధరణికోట ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం.. ఈ మధ్య కాశీకి వెళ్లి వచ్చింది. వచ్చిన కొద్ది రోజులకే అనారోగ్యం బారిపడటంతో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. వాళ్లలో 4 నలుగురికి పాజిటివ్‌గా వచ్చినట్లు రామవరం పీఎచ్సీ డాక్టర్ ఎన్.వి. కోటి రెడ్డి తెలిపారు. దీంతో ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి పారిశుద్ధ్య పనులు చేపట్టామని వైద్యాధికారి కోటిరెడ్డి తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విశాఖ జిల్లాలో..
జిల్లాలోని గోపాలపట్నం బాలికల పాఠశాలలో నలుగురు విద్యార్థులకు కరోనా వైరస్ నిర్ధారణ అయనట్లు వైద్యులు తెలిపారు. దీంతో పాఠశాల అంతా శానిటేషన్ చేయించారు. ప్రహ్లాదపురం పరిసర ప్రాంతాల్లో పరిసరాల్లో బ్లీచింగ్ చల్లారు. 95 వార్డు కృష్ణరాయపురంలో ఓ ఇంట్లో ముగ్గురికి పాజిటివ్ రావడంతో చుట్టుపక్కల వారి రక్త నమూనాలు సేకరించారు. స్థానికులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. తప్పనిసరిగా మాస్కు ధరించాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి: