Kakinada zp meeting: కాకినాడ జడ్పీ సమావేశంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్యే చంటిబాబు మధ్య వాగ్వాదం జరిగింది. జడ్పీటీసీలకు ఛాంబర్లు కేటాయించాలని జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు డిమాండ్ చేయగా.. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పని చేస్తున్నామని మంత్రి వేణుగోపాలకృష్ణ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వంలో ఉండి ఇలా మాట్లాడటం ఏంటని ఎమ్మెల్యేను మంత్రి ప్రశ్నించారు. దీంతో గట్టిగా మాట్లాడుతున్నారేంటని మంత్రిని చిట్టిబాబు నిలదీశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇవీ చదవండి: