కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుగ్గఅగ్రహారంలోని బుగ్గమల్లేశ్వరస్వామి దేవస్థానం సమీపంలో సొరంగ కారాగారం వెలుగుచూసింది. మైదుకూరుకు చెందిన నేస్తం సేవా సంస్థ ప్రతినిధి బాల నాగిరెడ్డి బుగ్గవంక ప్రాజెక్టును చూడటానికి వెళ్లగా... భూమి పైభాగంలో చిన్న రంధ్రాన్ని గుర్తించారు. అందులోకి దిగి పరిశీలించగా లోపల అద్భుతమైన నిర్మాణం బయటపడింది. దీనిపై చిత్తూరు, కడప పురావస్తుశాఖ ఏడీ శివకుమార్ మాట్లాడుతూ... ‘ఈ కారాగారం బ్రిటిష్ కాలం నాటిది. దీన్ని బంకరుగా, గోదాంగానూ ఉపయోగించి ఉండవచ్చు. ఇలాంటి నిర్మాణాలను బ్రిటిషర్లు రైల్వే ట్రాకు సమీపంలో నిర్మించేవారు’ అని తెలిపారు.
ఇదీచదవండి.