- ప్రాణాలు తీస్తోన్న కొరత..!
అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వాస్పత్రిలో నలుగురు కొవిడ్ బాధితులు మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో నలుగురు మృతి చెందడంతో బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటిలేటర్ల కొరతతో మృతి చెందారని ఆరోపిస్తున్నారు. రోగులను వేరే ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఆదేశాలు నిలిపివేత
కడప జువారి సిమెంట్ కంపెనీని మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24న పీసీబీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జువారి సిమెంట్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కొనసాగుతున్న విచారణ
తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను రాజమహేంద్రవరం అనిశా కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చిన అ.ని.శా. బృందం విచారణ చేస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'టికెట్లు చూపించి వెళ్లవచ్చు'
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో చిత్తూరు జిల్లావ్యాప్తంగా పాకిక్ష కర్ఫ్యూ అమలులో ఉంది. దర్శన టికెట్లు చూపించి తిరుమలకు వెళ్లవచ్చని చిత్తూరు జిల్లా ఎస్పీ అప్పలనాయుడు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డీఎంకే అధినేత స్టాలిన్‌కు గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ దురైమురుగన్‌తో కలిసి స్టాలిన్ గవర్నర్‌ను కలిశారు. పార్టీ శాసనసభాపక్షనేతగా తనను ఎన్నుకన్నట్లు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌కు లేఖను సమర్పించారు స్టాలిన్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు నివారించండి'
ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌ల్లో అగ్ని ప్రమాదాల నివారణపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది కేంద్ర హోంశాఖ. వేసవిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువున్న కారణంగా పటిష్ఠ చర్యలు చేపట్టాలని లేఖ రాసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'భారత్‌కు మద్దతుగా నిలువొద్దు'
వ్యాక్సిన్ ముడిపదార్థాల సరఫరాలో భారత్, దక్షిణాప్రికా దేశాలకు మద్దతుగా నిలువకూడదని 12 మంది అమెరికా చట్టసభ్యులు బైడెన్ బృందాన్ని కోరారు. కరోనా నేపథ్యంలో వర్తక సంబంధిత మేథో సంపత్తి హక్కుల (ట్రిప్స్) నిబంధనలను సడలించొచ్చొద్దని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మూడు నెలల కనిష్ఠానికి!
కరోనా సంక్షోభ ప్రభావం సేవా రంగంపై తీవ్రంగా పడింది. దేశీయంగా విధిస్తున్న ఆంక్షలు, వృద్ధి రేటుపై ప్రతికూల అంచనాల కారణంగా సేవా రంగ పీఎంఐ ఏప్రిల్‌లో 54కి తగ్గింది. ఇది మూడు నెలల కనిష్ఠం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- టెన్నిస్‌కు వీడ్కోలు
డబుల్స్ మాజీ నంబర్ వన్ ప్లేయర్ బార్బోరా స్త్రీచోవా.. టెన్నిస్‌కు గుడ్ బై చెప్పింది. సింగిల్స్‌లో రెండు డబ్ల్యూటీఏ పతకాలతో పాటు 31 డబుల్స్ టైటిల్స్ తన ఖాతాలో వేసుకుంది బార్బోరా. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- విడుదల వాయిదా
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న 'ఖిలాడి' విడుదల వాయిదా పడింది. దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.