అత్యుత్తమ జల సంరక్షణ చర్యలు చేపట్టిన రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి శాఖ అవార్డులను ప్రదానం చేసింది. 2వ జాతీయ జల అవార్డులను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంతర్జాలం ద్వారా ప్రదానం చేశారు. ఇందులో భాగంగా దక్షిణజోన్ విభాగంలో కడప జిల్లాకు ప్రథమ బహుమతి, తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు తృతీయ బహుమతి లభించింది.
నీతి ఆయోగ్ ఆకాంక్షిత జిల్లాల కేటగిరీలో విజయనగరం జిల్లా ప్రథమ బహుమతి గెలుచుకొంది. జాతీయ జలశక్తి అవార్డును జిల్లా తరపున కలెక్టర్ హరి జవహర్ లాల్ వర్చువల్ విధానంలో అందుకున్నారు. జలశక్తి అవార్డుకు విజయనగరం జిల్లాను ఎంపిక చేసినందుకు కలెక్టర్ హరి జవహర్ లాల్ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా యంత్రాంగం చేసిన కృషికి గుర్తింపు అవార్డు రావటం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు స్ఫూర్తితో జల సంరక్షణ కోసం మరింత కృషి చేస్తామని కలెక్టర్ హరిజవహర్ లాల్ తెలియచేశారు.
ఇదీ చదవండి:
ఇంటింటికి కుళాయి కనెక్షన్... జల జీవన్ మిషన్ పథకంతో ప్రజలకు నో టెన్షన్