కడప జైలులో రిమాండ్‌లో ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణయ్యింది. ఈ క్రమంలో జైలు సిబ్బంది ఆయన్ను ప్రత్యేక గదిలో ఉంచి.. ముగ్గురు వైద్యులతో పర్యవేక్షణ చేయిస్తున్నారు. బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఇటీవల బెయిల్‌పై విడుదలైన అనంతరం 24 గంటల్లోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేశారు.
సోమ, మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో.. జైలులో మొత్తం 317 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం అందరినీ ప్రత్యేక వార్డుల్లో పెట్టి పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చూడండి..