కడప ఏఎస్పీ చక్రవర్తి ఆదేశాల మేరకు కోడూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ తమ సిబ్బందితో కలిసి నాటుసారా, బెల్ట్ షాపులు, అక్రమ మద్యం నిల్వలపై కోడూరు మండల పరిధిలో దాడులు నిర్వహించారు. తూర్పు పల్లి క్రాస్ వద్ద కోడూరు నుంచి రాజంపేటకు వెళ్తున్న బస్సులో కూలింగ్ వాటర్ క్యాన్లో తరలిస్తున్న 12 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. సుండుపల్లి మండలం కేతిరెడ్డిగారి పల్లెకు చెందిన వేముల రామయ్యను అధికారులు అరెస్టు చేశారు.
అటవీలో నాటు సారా స్థావరాలు..
ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండలంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీకి ఉపయోగించే డ్రమ్ములు, సామగ్రిని అధికారుల స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: