అభివృద్ధి, సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైకాపాను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భాజపా అభ్యర్థిగా సురేశ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయగా..ఆ కార్యక్రమానికి సోము వీర్రాజు హాజరయ్యారు.
కుటుంబ వారసత్వాన్ని భాజపా ప్రొత్సహించదని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో వైకాపా మంత్రులు, నాయకులు అవినీతి కూపంలో కూరుకుపోయారన్నారు. దొంగ ఓట్లు సృష్టించే మంత్రి పెద్దిరెడ్డి బద్వేలులో మకాం వేశారని..,ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభివృద్ధి గాలికొదిలేసిన పార్టీకి ఓటేస్తారో..ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే పార్టీకి ఓటేస్తారో బద్వేలు ప్రజలు తేల్చుకోవాలన్నారు.
ఇదీ చదవండి