ETV Bharat / city

Brahmamgari Matam: పీఠాధిపతి మరణంపై అనుమానాలున్నాయి: శివస్వామి

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం(Brahmamgari Matam) పీఠాధిపతి మృతిపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి అన్నారు. రెండో భార్య చూపుతున్న వీలునామా చెల్లదని ఆయన పేర్కొన్నారు.

siva swami on bramhamgari matham at kadapa
పీఠాధిపతి మరణంపై అనుమానాలున్నాయి
author img

By

Published : Jun 13, 2021, 7:28 PM IST

Updated : Jun 13, 2021, 7:53 PM IST

ధర్మశాస్త్రం ప్రకారం పెద్దకుమారుడిని పీఠాధిపతిగా నిర్ణయించాం..

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం(Brahmamgari Matam) పీఠాధిపతి వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 12వ పీఠాధిపతిగా దివంగత పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికి అర్హత ఉందని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వెల్లడించారు. పీఠాధిపతి అర్హత అనేది వారసత్వంగా వచ్చే హక్కని వెంకటాద్రి స్వామికి అన్ని అర్హతలు ఉన్నాయని శివ స్వామి స్పష్టంచేశారు.

'పీఠాధిపతి రెండో భార్య వద్ద ఉన్న వీలునామా చెల్లదు. రెండో భార్య చూపించింది బలవంతపు వీలునామాగా గుర్తించాం. వారసత్వంగా పెద్ద కుమారుడికే పీఠాధిపత్యం ఉంటుంది. పీఠాధిపతి మరణంపైనా అనేక అనుమానాలు ఉన్నాయి. పీఠాధిపతిని హత్య చేసి ఉంటారని అనుమానంగా ఉంది. ఆరోగ్యంగా ఉన్న పీఠాధిపతి రెండ్రోజుల్లో ఎలా మరణిస్తారు..?'- శివస్వామి, శైవక్షేత్రం పీఠాధిపతి

ఇదీ చదవండి: Brahmamgari Matham: అలజడులు సృష్టించేందుకు శివస్వామి కుట్ర.. డీజీపీకి మహాలక్ష్మీ లేఖ

వెంకటేశ్వర స్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ దగ్గరున్న వీలునామా చెల్లదని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్చల పూర్తి వివరాల సారాంశాన్ని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని.. దీనికి సంబంధించి తమ దగ్గర ఉన్న ఆధారాలను మైదుకూరు పోలీసులకు అందజేస్తామని శివస్వామి తెలిపారు.

ఇదీ చదవండి:

'సంస్కరణలతోనే కాంగ్రెస్​కు పునరుజ్జీవం'

బ్రహ్మంగారి ఆలయాన్ని దర్శించుకున్న పీఠాధిపతులు

Last Updated : Jun 13, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.