కడపలో దోపిడీకి యత్నించిన వ్యక్తికి స్థానికుల దేహశుద్ధి - chory news in kadapa
కడప జిల్లా రవీంద్రనగర్‌లో నిన్న అర్ధరాత్రి దొంగతనానికి యత్నించిన ఓ వ్యక్తిని అక్కడి స్థానికులు పట్టుకున్నారు. ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు... ఒంటరిగా ఉన్న మహిళ మెడలో గొలుసు లాక్కునేందుకు యత్నించగా... స్థానికులు అతణ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అతను అసోంకు చెందిన వాడై ఉండవచ్చని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.
దొంగతనానికి యత్నించిన వ్యక్తిని పట్టుకున్న స్థానికులు
By
Published : Feb 7, 2020, 12:42 PM IST
దొంగతనానికి యత్నించిన వ్యక్తికి స్థానికుల దేహశుద్ధి