కర్నూలులో అతిపెద్ద పవర్ ప్లాంట్(1000 మెగావాట్లు), అనంతపురంలోని 400 మెగావాట్ల ప్లాంట్, రాయలసీమ పవర్ ప్లాంట్ ను విద్యుత్ శాఖ ఎండీ శ్రీధర్ సందర్శించారు. ఇంజనీర్ల పనితీరును పరిశీలించారు. ప్లాంట్ లో పనులు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్)లో కొంత జాప్యం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి నెల కేంద్రాల్లో జరిగే పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని చెప్పారు. అయితే ఆర్టీపీపీలో స్టేజ్-4 పనులలో ఆలస్యం జరుగుతుందని, వచ్చే 8 నెలల్లో పనులు పూర్తవ్వాలని అన్నారు. నేటికీ పనులు పూర్తి కాకపోవటం బాధాకరమన్నారు. దీనికి సంబంధించిన కాంట్రాక్టర్లను బుధవారం విజయవాడలో కలిసి చర్చిస్తామన్నారు.
ఇది చూడండి: గంగూలీ చొక్కా విప్పాడు.. బాలీవుడ్లో సినిమా వచ్చింది!