కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెన్నా నదిపై నిర్మించిన వంతెన రోజురోజుకూ కుంగుతోంది. గండికోట, మైలవరం జలాశయాల నుంచి నీరు విడుదల చేస్తుండటంతో.. వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
వరద తాకిడికి ఈ నెల 22న వంతెన మధ్య భాగం కుంగింది. ప్రయాణికులు గమనించి, పోలీసులకు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అప్రమత్తమై వంతెనపై రాకపోకలు నిలిపివేశారు.
వారం రోజులుగా మైలవరం నుంచి భారీగా వరద వస్తుండటంతో .. బ్రిడ్జి మధ్య భాగం మరింతగా కుంగిపోయింది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వంతెన వైపు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్రిడ్జి వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీచదవండి.