ETV Bharat / city

డాక్టర్​ ఒకటి రాసిస్తే... దుకాణదారు మరొకటి ఇచ్చాడు... చివరికి - కడప లేటెస్ట్​ అప్​డేట్​

medicines changed: మందుల షాపు వ్యక్తి చేసిన తప్పిదానికి ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. డాక్టర్​ రాసిన మందులకు బదులు వేరే మందులు ఇవ్వడంతోనే ఘోరం జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వక్తం చేశారు.

medicines changed
మందులు మారడంతో వృద్ధురాలు మృతి
author img

By

Published : Mar 7, 2022, 9:39 AM IST

Updated : Mar 7, 2022, 10:09 AM IST

medicines changed: కడప జిల్లా రాజంపేటలోని ఎర్రబల్లికి చెందిన కె.సుబ్బనరసమ్మ (67) అనే వృద్ధురాలికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో గతేడాది డిసెంబరులో కడపలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యపరీక్షల తర్వాత థైరాయిడ్‌ సమస్య ఉందని వైద్యులు ధ్రువీకరించారు. వ్యాధి నివారణకుగాను వైద్యుడు మందులు రాసిచ్చారు. సదరు వృద్ధురాలి కుమారుడు సుధాకరాచారి ఆ చీటీతో డిసెంబరు 27న రాజంపేటలోని ఓ మెడికల్‌ స్టోర్‌కు వెళ్లి మందులు తీసుకొచ్చారు. వాటిని రోజూ వేసుకున్న వృద్ధురాలికి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి మరోసారి వైద్యుడిని కలిశారు.

medicines changed: వైద్యుడు యాంటీ థైరాక్సిన్‌ 10 ఎంజీ రాసిస్తే.. థైరాక్సిన్‌ సోడియం 100 ఎంజీ మందులు వేసుకోవడం వల్ల ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. గత నెల 24న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు మెడికల్​ షాపుపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆమెను నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 5న మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'వివేకానందరెడ్డిని చంపేయ్‌.. మేమూ నీతో వస్తాం'

Last Updated : Mar 7, 2022, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.