విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తే చూస్తూ ఊరుకోమని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్థన్ రెడ్డి కడపలో హెచ్చరించారు. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అనే నినాదంతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విభజన చట్టంలోని హామీలను అమలుపరచకుండా.. ఉన్న వనరులను ప్రైవేటుపరం చేయడం దారుణమని గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. విశాఖ ఉక్కు కర్మాగారం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభిస్తోందన్నారు. అప్పట్లో ఎన్నో పోరాటాలు చేసి విశాఖ ఉక్కును సాధించుకున్నామని.. దాదాపు 60 గ్రామాల ప్రజలు నివాసాలను ఖాళీ చేసి వెళ్లిపోయారని గుర్తుచేశారు. అటువంటి సంస్థను ఈరోజు ప్రవేట్పరం చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై పోరాడేందుకు అందరూ కలిసిరావాలని.. పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: