కడప పోలీసు మైదానంలో శనివారం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విద్యా శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేశ్ హాజరు కానున్నారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో వేడుకలు నిర్వహిస్తున్నామని కడప నగర పాలక కమిషనర్ లవన్న తెలిపారు. భౌతికదూరం పాటించేలా తగిన ఏర్పాట్లు చేశామని వివరించారు. శకటాలను నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలలో పర్యటించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించి రావాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి