కడప కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైకాపా విస్పష్ట ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కడప కార్పొరేషన్లో మెుత్తం 50 డివిజన్లలో ఇదివరకే 24 ఏకగ్రీవమవ్వగా.. 26 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. వైకాపా 24, తెదేపా 1, ఇతరులు 1 స్థానంలో గెలిచాయి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీని కూడా వైకాపా కైవసం చేసుకుంది. 41 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో 9 ఏకగ్రీవం కాగా...32 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 31 వార్డులను వైకాపా గెలుచుకోగా.. ఒక వార్డును తెదేపా దక్కించుకుంది. బద్వేలు మున్సిపాలిటీలోనూ వైకాపా హవా కొనసాగింది. ఇక్కడ 35 వార్డులుండగా...10 వార్డులను వైకాపా ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 25 వార్డులకు ఎన్నికలు జరిగితే...18 వైకాపా, 2 తెదేపా గెలుచుకున్నాయి. రాయచోటి, పులివెందుల మున్సిపాలిటీల్లోనూ అధికార పార్టీ పాగా వేసింది. పులివెందుల మున్సిపాలిటీలో 33 వార్డులను వైకాపా ఏకగ్రీవం చేసుకుంది. రాయచోటి మున్సిపాలిటీలోని 34 వార్డులకుగానూ...ఇదివరకే 31 వార్డులు ఏకగ్రీవం కాగా...3 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మూడింటిలోనూ వైకాపా అభ్యర్థులే విజయం సాధించారు.
జమ్మలమడుగు, ఎర్రగుంట్ల నగర పంచాయతీలను వైకాపా కైవసం చేసుకుంది. జమ్మలమడుగు నగరపంచాయతీలో 20 వార్డులుండగా...18 వైకాపా, రెండు చోట్ల భాజపా అభ్యర్థులు గెలిచారు. ఎర్రగుంట్ల నగర పంచాయతీలోని 20 వార్డుల్లో 13 వార్డులను వైకాపా ఇదివరకే ఏకగ్రీవం చేసుకోగా.. ఎన్నికలు జరిగిన ఏడు వార్డులను కూడా వైకాపా గెలుచుకుంది.
మైదుకూరు మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. 24 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో...12 వార్డుల్లో తెదేపా అభ్యర్థులు గెలుపొందారు. 11 వార్డుల్లో వైకాపా, ఒక వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు.
ఇదీచదవండి