mayor letter on roads: ముఖ్యమంత్రి జగన్‌కు కడప మేయర్ సురేష్‌బాబు లేఖ రాశారు. కడప నగరపాలక సంస్థలో రోడ్ల విస్తరణకు నిధులు ఇవ్వాలని లేఖలో కోరారు. కడప నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువైనందున నభీకోట నుంచి రవీంద్రనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిని విస్తరించడం ద్వారా కడప నుంచి ప్రొద్దుటూరు, రాయచోటి, పులివెందులకు వెళ్లే బస్సులను దారి మళ్లించే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. కడప నభికోట నుంచి రవీంద్రనగర్ వరకు రహదారి విస్తరణ చేయాలని విజ్ఞప్తి చేసారు. రహదారి విస్తరణ సమయంలో కొత్త రోడ్డు వేయడానికి, కట్టడాలు తొలగించండం.. బాధితులకు పరిహారం ఇవ్వడానికి మొత్తం రూ.14.20 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు మేయర్ సురేష్ బాబు లేఖలో వెల్లడించారు. రహదారి విస్తరణకు రూ.14.20 కోట్లు మంజూరు చేయాలని కడప మేయర్ లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: