ETV Bharat / city

మూడు రోజులుగా జోరువానలు... లోతట్టు ప్రాంతాలు జలమయం.. దెబ్బతిన్న పంటలు

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా జోరువాన(heavy rains) కురుస్తోంది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లల్లోకి వరద నీరు చేరి అవస్థలు పడుతున్నారు. ఈదురుగాలులకు వరిపంట పూర్తిగా దెబ్బతింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

heavy rains last three days
అల్పపీడన ప్రభావంతో జోరువానలు
author img

By

Published : Nov 4, 2021, 11:33 AM IST

అల్పపీడన ప్రభావంతో మూడురోజులుగా జోరువానలు

కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం(heavy rain at kadapa district) కురుస్తోంది. కడప నగరంలోని రోడ్లు, వీధులు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. కడప పాత బైపాస్ రోడ్‌లో మోకాలు లోతు వరకు నీరు నిలిచిపోయింది. సమీపంలోని ఎస్​ఆర్ కాలనీలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు నగరం మొత్తం నీటితో నిండిపోతుందని.. అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలకు బుగ్గవంక ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. దీంతో బుగ్గవంక పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

బద్వేల్‌లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ గ్యారేజ్​లోకి వర్షపు నీరు చేరడంతో బస్సుల మరమ్మతులు నిలిచిపోయాయి. నీటిని మోటార్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో పంటలు నీటమునిగాయి(crops field damaged in badvel). జమ్మలమడుగు, పెద్దముడియం మండలాల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటించి నీట మునిగిన పంటలను పరిశీలించారు. నష్ట తీవ్రతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే చెప్పారు.

విజయనగరం జిల్లా సాలూరులో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు(heavy rains in Vizianagaram district Salur) నీట మునిగాయి. మామిడిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వరద నీరు చేరి విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడ్డారు. సాలూరు, పాచిపెంట మండలంలోని పత్తి ,మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతుల ఆందోళన చెందుతున్నారు. మళ్లీ గులాబ్ తుఫాన్ పరిస్థితి వస్తుందోమోనని ప్రజలు భయపడుతున్నారు.

చిత్తూరు జిల్లాలో వర్షాలకు వ్యవసాయ బోర్లు పొంగిపొర్లుతున్నాయి(rains in chittoor district). గతంలో నీళ్లులేక ఎండిపోయిన బోర్ల నుంచి నీరు బయటకు ఉబికి వస్తోంది. ప్రకాశం జిల్లాలో కురుస్తున్నవర్షాలకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిర్చి, మినుము, బొబ్బర్ల పంటలకు వర్షాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

ఇదీ చదవండి..

Paddy Crop Damage : వరి "వెన్ను" విరిగింది.. అన్నదాత కన్ను చెమ్మగిల్లింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.