ETV Bharat / city

పంట బీమా చెల్లించలేదని రైతులు ఆగ్రహం...గ్రామ సచివాలయానికి తాళం

author img

By

Published : Jun 15, 2022, 2:04 PM IST

Farmers Agitation: చినుకు పడిన నాటి నుంచి చిగురు తొడిగి.. పంట చేతికొచ్చేంత వరకూ.. ఒపిగ్గా ఎదురు చూసే రైతన్నలు కోపోద్రిక్తులయ్యారు. పంట బీమా తమకు ఇంకా అందలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం మాచనూరులో చోటు చేసుకుంది.

Farmers Agitation
Farmers Agitation

గ్రామ సచివాలయానికి తాళం వేసిన రైతులు

Farmers locked Village Secretariat: వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం మాచునూరు గ్రామ సచివాలయానికి రైతులు తాళం వేశారు. ప్రభుత్వం విడుదల చేసిన పంటల బీమా తమకు అందలేదని ఆగ్రహంతో అన్నదాతలు సచివాలయం వద్దకు వెళ్లి కార్యాలయానికి తాళం వేశారు.

మాచనూర్ గ్రామంలో దాదాపు 600 రైతు కుటుంబాలు ఉన్నాయి. అయితే పంటల బీమా కేవలం 20 శాతం మందికి మాత్రమే వర్తింపజేశారని.. మిగిలిన వారందరికీ మొండి చెయ్యి చూపారని రైతులు ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు గ్రామ సచివాలయానికి వెళ్లి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సచివాలయంలోని సిబ్బంది అందరినీ బయటికి పంపి...కార్యాలయానికి తాళం వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినని అన్నదాతలు తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. పత్తి పంటకు ఈ-క్రాప్ నమోదు చేసుకున్నప్పటికీ పంటల బీమా ఎందుకు వర్తింపజేయలేదని ప్రశ్నించారు.

అక్కడ పనిచేస్తున్న వ్యవసాయ అధికారులు కొందరు రాజకీయ నాయకులు సూచించిన వారి పేర్లను మాత్రమే పంటల బీమా జాబితాలో ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. మిగిలిన రైతులకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. జిల్లా వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లినా తమకు న్యాయం జరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.తమ గోడు పట్టించుకునే వారే లేరని ఆక్రోశించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.