ETV Bharat / city

కడపలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న 8 మంది అరెస్ట్ - కడపలో క్రికెట్ బెట్టింగ్

కడప నగరంలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు, బెట్టింగ్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

cricket bookies arrest in kadapa
కడపలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న 8 మంది అరెస్ట్
author img

By

Published : Oct 16, 2020, 7:19 PM IST

కడప పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 3 వేర్వేరు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. 8 మంది బుకీలను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.11.50 లక్షల రూపాయల నగదు, 8 చరవాణిలు, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నారు.

దీని గురించి డీఎస్పీ సూర్యనారాయణ వివరాలు తెలియజేశారు. 'కడప ఒకటో పట్టణ పరిధిలో నలుగురు వ్యక్తులు ఐపీఎల్ మ్యాచ్​లపై బెట్టింగ్​కు పాల్పడుతున్నట్లు సమాచారం వచ్చింది. అలాగే వల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు ఆన్​లైన్ క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించి వారిని అరెస్ట్ చేశాం. కడప రిమ్స్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.11.50 లక్షలు నగదు, 8 సెల్​ఫోన్లు, టీవీ స్వాధీనం చేసుకున్నాం. ప్రధాన బుకీ మాధవరెడ్డి కోసం గాలిస్తున్నాం' అని డీఎస్పీ వివరించారు.

ఇవీ దదవండి..

రైతు బిడ్డకు ఆహార సాంకేతిక విభాగంలో ప్రథమ ర్యాంకు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.