గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 61,363 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,361 కరోనా కేసులు, 15 మరణాలు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కొవిడ్ నుంచి మరో 1,288 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,510 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జిల్లాల వారీగా మృతులు..
కోవిడ్ వల్ల కృష్ణాలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, వైఎస్ఆర్ కడపలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించారు.
జిల్లాల వారీగా కేసులు...
నెల్లూరులో 282, చిత్తూరులో 203, అనంతపురంలో 26, తూర్పుగోదావరిలో 143, గుంటూరులో 131, కడపలో 104, కృష్ణాలో 99, కర్నూలులో 13, ప్రకాశంలో 87, శ్రీకాకుళంలో 25, విశాఖపట్నంలో 73, విజయనగరంలో 26, పశ్చిమగోదావరిలో 149 కేసులు నమోదయ్యాయి.
ఇదీచదవండి.