Tulasi Reddy on YCP ruling: రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. అతి త్వరలో సీఎం జగన్ రాష్ట్రానికి ఐపీ పెడతారని ఎద్దేవా చేశారు. ఆర్థిక వ్యవహారాలన్నీ రాష్ట్రపతి పర్యవేక్షణలో ఉండాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంపై 7 లక్షల 76 వేల కోట్ల రూపాయల అప్పు ఉందన్నారు. ఒక్కో మనిషిపై లక్షన్నర రుణం ఉన్నట్లేనని తులసిరెడ్డి చెప్పారు. బడ్జెట్లో చూపించకుండా 86 వేల 260 కోట్ల రూపాయలు అప్పులు చేశారని విమర్శించారు.
ఇదీ చదవండి : "కొడాలి నానిని.. వైకాపా నేతలే అసహ్యించుకుంటున్నారు"