Thulasi Reddy on Chandraiah Murder: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లాలో తెదేపా నాయకుడు చంద్రయ్య హత్య ఘటన అమానుషమని కడపలో వ్యాఖ్యానించారు.
పట్టపగలు వైకాపా నాయకులు కత్తులు, బండరాళ్లతో చంద్రయ్యను కొట్టిచంపడం ఆటవిక పాలనను తలపిస్తోందన్నారు. రాష్ట్రంలో రౌడీరాజ్యం రాజ్యమేలుతోందన్న తులసిరెడ్డి... శాంతిభద్రతలు గాడితప్పాయని విమర్శించారు. కనీసం శాంతిభద్రతలనైనా పరిరక్షించాలని జగన్ను కోరారు.
ఇదీ చదవండి.. :YSRCP Clases: ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయుల మధ్య ఘర్షణ.. పోలీసులకు ఫిర్యాదు