ETV Bharat / city

"కడప, పులివెందులను ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దండి" - సచివాలయంలో సీఎం జగన్ సమీక్ష వార్తలు

కడప, పులివెందులను ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అభివృద్ధి పనులతో పాటు పులిచింతలలో వైఎస్​ఆర్ ఉద్యానవనం, విశాఖలో లుంబినీ పార్క్ అభివృద్ధిపై సీఎం సమీక్షించారు.

Cm jagan Review On Pulivendula development
author img

By

Published : Nov 25, 2019, 9:04 PM IST

"కడప, పులివెందులను ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దండి"

కడప, పులివెందులను మోడల్‌ టౌన్స్‌గా తీర్చిదిద్దాలని, పైలెట్‌ ప్రాజెక్ట్‌గా పనులు ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. వైఎస్‌ఆర్‌ మెమోరియల్‌ గార్డెన్, బొటానికల్‌ గార్డెన్, గండి టెంపుల్‌ కాంప్లెక్స్, ఐఐటీ క్యాంపస్, ఎకో పార్క్, జంగిల్‌ సఫారీ, పీకాక్‌ బ్రీడింగ్‌ సెంటర్‌ అభివృద్ధి చేసే విషయమై అంచనా వివరాలను అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. సుందరీకరణ పెరిగే విధంగా ఆర్కిటెక్చర్స్‌ ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్‌ వివరాలను ముఖ్యమంత్రి సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పర్యటక ప్రాజెక్టులపై అధికారులు పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ఏ పని చేసినా దీర్ఘకాలికంగా మన్నికతో పాటు ప్రాజెక్టును ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించాలని సీఎం ఆదేశించారు.

ఈ ప్రాజెక్టు అమలుకు అవసరమైన సహాయాన్ని పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (పాడా)నుంచి తీసుకొవాలని సీఎం ఆదేశించారు. పులిచింతలలో వైయస్ఆర్ ఉద్యానవనం ప్రణాళికను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. విశాఖపట్నంలో లుంబినీ పార్క్‌ అభివృద్ది పనుల పురోగతిని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా ఇదే తరహాలో పార్క్‌ రూపొందించాలని ముఖ్యమంత్రి వారిని ఆదేశించారు.

ఇదీ చదవండి:

నాలుగు భవనాలు తప్పితే అమరావతిలో ఏముంది..? మంత్రి బొత్స

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.