కడప జిల్లా ఖాజీపేటకు చెందిన హుస్సేన్ బాషా కారు నడుపుతూ కడపకు వచ్చాడు. పని ముగించుకొని తిరిగి ఖాజీపేటకు బయలుదేరాడు. అల్మాసుపేట వద్దకు రాగానే రోడ్డుపై వెళ్లతున్న వాహనదారున్ని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
మరో ఐదుగురిని అదే వాహనం ఢీ కొట్టగా.. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని తిరుపతి సిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: