కరోనా వైరస్ నివారణలో భాగంగా కడపలో లాక్‌డౌన్ పక్కాగా అమలవుతోంది. కడప పాత మార్కెట్, రైతు బజార్లను అధికారులు 20 భాగాలుగా విభజించారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను కూరగాయల మార్కెట్‌గా మార్చేశారు. బస్సులు పార్కింగ్ చేసే ప్లాట్ ఫాంలపై కూరగాయలను విక్రయిస్తున్నారు. వినియోగదారులు మాస్కులు ధరించి వ్యక్తిగత దూరం పాటిస్తూ కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. మున్సిపల్ మైదానం జడ్పీ ఆవరణతో పాటు పలు కళాశాలల ఆవరణలో మార్కెట్లను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ వారి సమీపంలో ఉన్న కూరగాయల మార్కెట్‌కు వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో సంచార వాహనాల్లో నిత్యావసరాలను విక్రయిస్తున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే దుకాణాలకు పోలీసులు అనుమతిస్తున్నారు.
ఇవీ చదవండి: