ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపడుతున్నట్లు డీఎస్పీ సునీల్ చెప్పారు. కడప రైతు బజార్ వద్ద ట్రాఫిక్‌ను ఆయన పరిశీలించారు. రైతు బజార్‌కు వచ్చే వారు వాహనాలను లోపలికి తీసుకెళ్లడం వల్ల ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. వాహనాలను హైలెవెల్ వంతెన వద్ద పార్కింగ్ చేయడం వల్ల ఇతర వాహనదారులకు ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. పార్కింగ్‌ను అక్కడి నుంచి తొలగించి జెడ్పీ ఎదుట ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. నగరంలో ఉన్న ట్రాఫిక్ సమస్యలను ఒక్కో రోజు ఒక్కో ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: ఎర్రచందనం అక్రమ రవాణా.. ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు