వైకాపా, తెదేపా పార్టీలు మతతత్వ, కుటుంబ పార్టీలని భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ అన్నారు. వ్యక్తిగత కార్యక్రమంపై కడపకు వచ్చిన సునీల్ దేవధర్.. ఆర్అండ్బీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. తొలుత కొంతమంది భాజపాలో చేరారు. సునీల్ దేవధర్.. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోడీ పాలనలో దేశం సుభిక్షంగా పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే అభివృద్ధి చేయగలదని అన్నారు.
బద్వేల్లో లవ్ జిహాద్ పేరిట గుజరాత్‌కు చెందిన హిందూ అమ్మాయిని వైఎస్ఆర్ జిల్లా బద్వేల్‌కు చెందిన ముస్లిం అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడి.. ఒకరినొకరు ప్రేమించుకుని అమ్మాయిని బద్వేలుకి తీసుకొచ్చారని తెలిపారు. భాజపా జిల్లా అధ్యక్షులు స్పందించి వెంటనే జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడి తల్లిదండ్రులను ఒప్పించి ఎవరి స్వస్థలాలకు వారిని పంపించారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే అభివృద్ధి చేయగలదు. రాష్ట్రాన్ని బంగారు ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకే జనసేనతో కలిసి ముందుకెళ్తున్నాం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చబోమన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. భాజపా కాకుండా మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటానంటూ ఆయన చెప్పలేదు. అవినీతి, రౌడీయిజమే కాకుండా రాష్ట్రాన్ని అర్థిక కష్టాల్లోకి నెట్టేసిన పార్టీని ఓడించాలనుకునే పార్టీలు.. మాతో కలవాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం జనసేనతో కలిసే ఉన్నాం.. కలిసే ఉంటాం.. మరో పొత్తు ప్రస్తావనకు అవకాశం లేదు. -సునీల్ దేవధర్, భాజపా జాతీయ కార్యదర్శి
ఇదీ చదవండి: APMDC: 'ఎవరికి సబ్ లీజుకు ఇచ్చారనేది ప్రభుత్వానికి అనవసరం'