వచ్చే ఎన్నికల్లో భాజపా, తెదేపా మధ్య పొత్తు ఉండదని దిల్లీలో భాజపా నేతలు సునీల్ దేవదర్, జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ (BJP MP CM Ramesh) తీవ్రంగా స్పందించారు. ఏ పార్టీతో పొత్తు(BJP Alliance) పెట్టుకోవాలనే విషయాన్ని నిర్ణయించేది సునీల్ దేవదర్, జీవీఎల్, సీఎం రమేష్ కాదని ఆయన వ్యాఖ్యానించారు.
పొత్తుల అంశం కేంద్ర పార్టీ అధ్యక్షుడు లేదంటే అమిత్ షా నిర్ణయిస్తారు కానీ ఎవరూ అలాంటి మాటలు మాట్లాడటం మంచిది కాదని కొట్టి పారేశారు. అమరేందర్ సింగ్ లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి... భాజపాతో పొత్తు పెట్టుకుంటారని ఎవరైనా ఊహించారా అని ప్రశ్నించారు. కనుక రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేమనన్న సీఎం రమేష్... ఎపుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరన్నారు. జీవీఎల్, సునీల్ దేవదర్ లాంటి వ్యక్తులు వ్యక్తిగతంగా మాట్లాడి ఉండవచ్చు గానీ... అది పార్టీ నిర్ణయం కాదని సీఎం రమేష్ కడపలో మీడియాతో అన్నారు.
ఇదీ చదవండి : BADVEL BY ELECTIONS: బద్వేలు బరిపై వైకాపా గురి.. 30న పోలింగ్, 2న కౌంటింగ్..