ETV Bharat / city

BADWEL BY-POLL: నేడు జగన్​తో భేటీ కానున్న బద్వేలు అభ్యర్థి

author img

By

Published : Sep 29, 2021, 9:09 PM IST

Updated : Sep 30, 2021, 2:22 AM IST

13212872బద్వేల్ ఉప ఎన్నిక వైకాపా అభ్యర్థి
బద్వేల్ ఉప ఎన్నిక వైకాపా అభ్యర్థి

21:06 September 29

అభ్యర్థి డా.సుధతో పాటు సీఎంను కలవనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

 కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి వైకాపా అధిష్ఠానం వేగం పెంచింది. బద్వేలు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. ఈ మేరకు వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధను తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చారు. ఫలితంగా ఆమె బద్వేలు నుంచి విజయవాడ బయల్దేరారు. డాక్టర్ సుధతో పాటు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీ అవినాష్ రెడ్డి, ముఖ్య నేతలతో సీఎం జగన్ గురువారం సమావేశం కానున్నారు.  

  బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. అభ్యర్థి గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఏడు మండలాలకు బాధ్యులను అప్పగించే విధంగా ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు. మహిళా అభ్యర్థి కావడంతో ఆమె గెలుపు కోసం జిల్లా నేతలంతా కలిసికట్టుగా పని చేసి విజయం సాధించే విధంగా సీఎం సూచనలు చేసే వీలుందని పార్టీ వర్గాల సమాచారం.

ఎమ్మెల్యే మృతి.. ఉప ఎన్నిక అనివార్యం

బద్వేల్ శాసనసభ్యుడుగా గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 28వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు ఎంబీబీఎస్ చేస్తుండగా... మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కడపలో ఆర్థోపెడిక్ డాక్టర్​గా వెంకటసుబ్బయ్య కొంత కాలం సేవలందించారు. వైకాపా నుంచి 2019లో తొలిసారిగా బద్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వు అయిన కారణంగా.. మంచి సౌమ్యుడిగా పేరున్న డాక్టర్ వెంకట సుబ్బయ్యకు వైకాపా అధిష్ఠానం ఎమ్మెల్యే సీటు కేటాయించింది. రెండేళ్ల నుంచి ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు.. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

వైకాపా అభ్యర్థిగా సుధ !

బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల కావడంతో అక్కడ అధికార పార్టీ నుంచి... దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధ పేరును వైకాపా అధిష్ఠానం ఖరారు చేసింది. 

మరోసారి ఆయనకే..

ఈ ఉప ఎన్నికకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. గత ఎన్నికల్లో వెంకటసుబ్బయ్యపై పోటీ చేసి ఓటమి పాలైన ఓబులాపురం రాజశేఖర్‌నే మరోసారి బరిలో నిలిపింది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ముందుగానే అభ్యర్థి ఖరారుకావడంతో..ఆయన ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్య నేతలను కలిసి ఎన్నికల్లో మద్దతు కోరుతున్నారు. 2019 ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీకి తెదేపా తరపున పోటీ చేసి.. వెంకటసుబ్బయ్య చేతిలో ఓడిపోయారు.

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ఉప ఎన్నికల్లో కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. సమావేశమందిరాల్లో 30 శాతం మందిని, బహిరంగ సభల్లో అయితే మైదానం సామర్థ్యంలో 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలి. ముఖ్య ప్రచారకర్తల సంఖ్య 20 మందికి మించకూడదు. రోడ్‌ షోలు, కార్లు, మోటారు సైకిళ్లు, సైకిల్‌ ర్యాలీలకు అనుమతిలేదు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు అయిదుగురికి మించకుండా ఇంటింటి ప్రచారం చేసుకోవాలి. ఎన్నికల రోజున అభ్యర్థి రెండు వాహనాలతో ముగ్గురు వ్యక్తులతోనే పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించాలి.

ఇదీచదవండి.

AP Fibernet case: వేమూరి హరిప్రసాద్‌కు ముందస్తు బెయిల్‌

Last Updated : Sep 30, 2021, 2:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.